Thursday, 5 November 2026

పట్టణ రోడ్లకు మహర్దశ ఎమ్మెల్యే భాస్కరరావు

పట్టణ రోడ్లకు మహర్దశ
ఎమ్మెల్యే భాస్కరరావు
జనం సాక్షి, మిర్యాలగూడ. భారస ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆరో వార్డు ఇందిరమ్మ కాలనీలో ఆర్ అండ్ బి మున్సిపల్ నిధులతో మంజూరైన రూ కోటి 50 లక్షల నిధులతో నార్కట్పల్లి అద్దంకి బైపాస్ నుండి ఇందిరమ్మ కాలనీలో ఎన్ఎస్పి కాలువ బ్రిడ్జి వరకు ఒక కిలోమీటర్ మేర బిటి రోడ్డు నిర్మణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పిఎసిఎస్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, స్థానిక కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాస్ రావు, బనావత్ లలిత సక్రు, ఆర్ అండ్ డి ఈ గణేష్ ,ఏ ఈ. రాంబాబు,మున్సిపల్ డి సాయి లక్ష్మి, నాయకులు ఫయాజ్, కుర కృష్ణ కాంత్, గంటా శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.