Wednesday, 4 November 2026

కేంద్రీయ విద్యాలయం బేగంపేట లో G20ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ :నిర్వహించిన ప్రిన్సిపాల్ ఆర్.శంకర్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 కేంద్రీయ విద్యాలయం ఎయిర్ ఫోర్స్ బేగంపేట స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్.శంకర్ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్య తో ప్రచారం కింద G20 సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో జూన్ 01 నుండి జూన్ 15 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి.విద్యార్థిని విద్యార్థులు కు పాఠశాల వేసవి సెలవులు కావడంతో చాలా వరకు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానే కార్యక్రమాలు నిర్వహించారు.2023 సంవత్సరానికి గానూ భారత్‌ను గ్రూప్‌ జి 20 ప్రధానమంత్రి చైర్మన్‌ గా చేయడంతోపాటు సంబంధిత దేశాల సదస్సు కూడా నిర్వహించడం గమనార్హం.ఈ కార్యక్రమాల ప్రచారం కోసం, సామాన్యులకు సమాచారం అందేలా ప్రజా భాగస్వామ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. దీని కేంద్రీయ విద్యాలయం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట ఒక వేదిక గా నిర్వహించడం విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేశారు.