డోర్నకల్ 15(జనం సాక్షి):దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం డోర్నకల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామల సర్పంచ్ జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం పల్లె ప్రగతి ద్వారా,గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను,వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని,గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను గ్రామ పంచాయితీ కార్యదర్శి వివరించారు.గ్రామ పారిశుద్ధ్యం,పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరు.ఈ సమావేశంలో పల్లెప్రగతి విజయాలను,జిల్లా,రాష్ట్ర,స్థాయిలో సాధించిన అవార్డులు పారిశుద్ధ్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించి,గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించారు.గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.గ్రామప్రజలు,అధికారులు,ప్రజాప్రతినిదులు ర్యాలీగా ఏర్పడి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం,నర్సరీ,వైకుంఠదామలను సందర్శించారు.ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు చెరెడ్డి సమ్మిరెడ్డి, తేజావత్ గమ్మిరాజు నాయక్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలన్నీ అభివృద్ధి చెందాయని,పట్టణాల్లో ఉన్న సౌకర్యాలను పల్లెల్లో కల్పిస్తూ తాగునీటికి ఇబ్బందులు తొలగి ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయని అన్నారు.పల్లెల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి,గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు,డంపింగ్యార్డులను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారన్నారు.పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేశారని తెలిపారు. పల్లెల్లో 24గంటల కరెంటు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటిని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలలో మెరుగైన వసతులు కల్పించిందని వాళ్లు అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గొడుగు సురేష్, సీసీ రఘు,మండల యూత్ జాయింట్ సెక్రెటరీ రాజీవ్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి లు సుధారాణి, ప్రవీణ,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




