Wednesday, 4 November 2026

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై

 

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 8,(జనంసాక్షి):నీల్వాయి  పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్సైగా పి సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు. నీల్వాయి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపతి నరేష్ తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో గోదావరిఖని వన్ టౌన్ ఎస్సైగా ఉన్న సుబ్బారావు నీల్వాయి ఎస్సైగా బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై సుబ్బారావు మాట్లాడుతూ … మండల శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జూదం,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీసు సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు.