జహీరాబాద్ జనవరి 22 (జనంసాక్షి ) జహీరాబాద్ లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రోటోకాల్ విషయంలో చిన్న గొడవ వల్ల జిల్లా జహీరాబాద్ లో నలిగిపోతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా అధ్యక్షుని సొంత నిర్ణయాలతో జంగం గోపి పై సస్పెన్షన్ ప్రకటన జహీరాబాద్ ప్రజలు ఆమోదించకపోవడం నేపధ్యంలో జంగం గోపిని బిజెపి పార్టీలో కొనసాగించాలని జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ జంగం గోపి కావాలని ఢిల్లీ అధిష్టానానికి ఐదువేల పైచిలుకు ఉత్తరాల ద్వారా కేంద్ర నాయకత్వానికి సందేశం పంపారు.నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఓం కన్వెన్షన్లో జరిగిన తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి సీనియర్ నాయకులు జంగం గోపి హాజరయ్యారు.పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జి, జాతీయ నాయకులు మురళీధర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై భవిషత్ కార్యాచరణ గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.
కేంద్ర పెద్దలతో జంగం గోపి భేటీ కేంద్ర పెద్దలతో జంగం గోపి భేటీ




