Thursday, 5 November 2026

దేవాలయ అభివృద్ధికి 5000 రూ ఆర్థిక సహాయం

మెట్పల్లి టౌన్, జనవరి 22, జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలో శ్రీ శంకర్ దాసమ్మయ్య దేవస్థానం అభివృద్ధి కొరకై మెట్పల్లి డివిజన్ లో విరాళాల సేకరణ జరుగుతుంది, కావున స్వచ్ఛందంగా ఉత్సాహంతో ముందుకు వచ్చి సభ్యులు తమకు తోచినంత విరాళాలు అందించవలసిందిగా సంఘ సభ్యులు కోరడమైనది మల్లాపూర్ మండల్ శ్రీ శంకర్ దాసమయ్య దేవస్థానం అభివృద్ధి కొరకై జగిత్యాల జిల్లా నాయకులు మాజీ పట్టణ అధ్యక్షుడు రాపర్తి వినోద్ గుడి నిర్మాణం కొరకై ఐదువేల రూపాయలు విరాళం అందజేశారు. అదేవిధంగా మేరు కుల సంఘ సభ్యులు మేరు కులదైవమైన శంకర్ దాసమయ్య ఆలయ అభివృద్ధి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డివిజన్ లోని మేరు కుల సంఘ సభ్యులు కుల బాంధవులు పాల్గొన్నారు.