గద్వాల నడిగడ్డ జనవరి 27 (జనం సాక్షి);కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మెమరండం పంపాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతు సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని రైతు సంఘాలు పోరాటాలు చేసిన ఫలితంగా నల్ల చట్టాలను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసిందనీ, ప్రధాన సమస్యలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని రుణ విమోచన చట్టం విద్యుత్ సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలనీ, 60 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులకు నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్లతో వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.గోపాల్ ,జిల్లా అధ్యక్షులు ఖాజా మహిముద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యా రెడ్డి, కె నాగరాజు ,బుచ్చన్న, రామకృష్ణ, టి. వెంకటేష్, సుదర్శన్ తదితర రైతులు పాల్గొన్నారు.




