Wednesday, 4 November 2026

చింతకుంట్ల గ్రామంలో గ్రంథాలయాన్ని సందర్శించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు

 

 

 

 

 

మద్దిమడుగు బిక్షపతి కొండముల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి )న్యూస్: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి శుక్రవారం చింతకుంట్ల గ్రామం మీదుగా వెళుతూ చింతకుంట్ల గ్రామం లోని గ్రంథాలయాన్ని సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో గ్రంధాలయాలు ఉండడం ఆ గ్రామ విజ్ఞాన అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. గ్రంథాలయాలలో ఎక్కువ సమయం గడిపిన వారు సమాజంలో ఉన్నత స్థానం చేరే అవకాశం ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రోజులో సుమారు 18 గంటలు గ్రంథాలయంలో గడిపి ప్రపంచ మేధావిగా గుర్తించబడి భారత రాజ్యాంగాన్ని మనకు అందించారన్నారు. గ్రామంలోని యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా ర్తిగా తీసుకొని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రంధాలయాల ద్వారా అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు వెళ్లే విధంగా గ్రంధాలయాల ద్వారా గ్రామంలో యువత ఎంతో మేధస్సును సంపాదించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు గ్రంధాలయాలను వాడుకొని పరీక్షల్లో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల ఉపసర్పంచ్ యేకుల సురేష్, గ్రంధాలయ నిర్వహకులు అంజనేయులు, హరికృష్ణ, నాగేష్, సహాదేవ్, చక్కని అంజి, నాగార్జున్, రవి తదితరులు పాల్గొన్నారు.