Tuesday, 3 November 2026

గులాబీ జెండాయే అందరికి అండ – సీఎం కేసీఆర్ నాయకత్వమే అందరికీ శ్రీరామ రక్ష

 

 

 

 

 

అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు – శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 27 (జనంసాక్షి): గులాబీ జెండాయే అందరికి అండ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే అందరికీ శ్రీరామ రక్ష అని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు షేక్ అలీ అధ్వర్యంలో మండలంలోని బురుగడ్డ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 100 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేతులమీదుగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, కొత్త, పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ ఒక్క తెరాస పార్టీనే అని అన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని బారాస పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో అందరూ పని చెయ్యాలని బారాస పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడొద్దని అందరు పార్టీ కోసం కలిసికట్టుగా పని చెయ్యాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. అనేక గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. పార్టీలో చేరినవారు మఠంపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, గుండు సైదులు గ్రామ శాఖ అధ్యక్షులు, ఆవుల వెంకటయ్య, గూడెపు బ్రహ్మం, గండు చిన్న సైదులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.