Friday, 6 November 2026

దూదిపాల రుక్మిణమ్మ గారి మృతి చాలా బాధాకరం టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

దూదిపాల రుక్మిణమ్మ గారి మృతి చాలా బాధాకరం టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ కొండమల్లేపల్లి అక్టోబర్ 27 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ వాస్తవ్యులు దూదిపాల రుక్మిణమ్మ (85) మృతి చాలా బాధాకరమని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ పేర్కొన్నారు కొండమల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్, టిపిసిసి కార్యవర్గ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి అమ్మ గారైన దూదిపాల రుక్మిణమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుమారుడు డాక్టర్ దూదిపాల వేణు రెడ్డిని ఓదార్చారు స్వర్గీయ దూదిపాల రుక్మిణమ్మ గారు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారని,ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నారని చింతకుంట్ల గ్రామం తో పాటు కొండమల్లేపల్లి మండలంలో చాలా గ్రామాలకు తమ విలువైన సేవలు అందించారని కొనియాడారు కొండమల్లేపల్లి మండలం అభివృద్ధిలో స్వర్గీయ రుక్మిణమ్మ గారు కృషి ఉందన్నారు కేతావత్ బిల్యా నాయక్ తో పాటు వడ్లపల్లి చంద్రారెడ్డి, కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, హరిలాల్ నాయక్, మోతీరాం నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు