పెద్దఅడిషర్లపల్లి మే8(జనంసాక్షి ):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సోమవారానికి 11 వ రోజు కార్యక్రమంలో పి ఏ పల్లి మండల జూనియర్ మరియూ ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మహాత్మా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇట్టి సమావేశం నందు కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు.




