జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కమాన్ పూర్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం కమాన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు జంగపల్లి అజయ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధిలుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని కమాన్ పూర్ మండల పార్టీ ఆఫీస్ ను ప్రారంభించి,కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పథకలు మరింతగా ప్రజలకు వివరించాలని, కేంద్రం లో మళ్ళీ మనమే అధికారం లోకి వస్తున్నాం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రపంచం లో భారత దేశాన్ని ఒక మార్గదర్శకంగా తీర్చిదిద్దరు, కరోనా తో ప్రపంచం అల్లాడి పోతుంటే ఉచిత టీకాలు ఇచ్చి ఆదుకున్నారు. బి ఆర్ స్ కు గట్టి పోటీ ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ,బి ఆర్ స్ నియంత, కుటుంబ పాలనకు చరమ గీతం బీజేపీ పార్టీ తో పాడుదాం, పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ లో సముచిత స్థానం ఉంటుంది, కష్టపడ కార్యకర్తకు గుర్తింపు బీజేపీ పార్టీ లో ఉంటుంది దానికి నిదర్శనం మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, రానున్న రోజులో బీజేపీ మరింత పుంజుకుంటుంది, మంథని ప్రాంతంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి, కాంగ్రెస్, బి ఆర్ స్ మంథనికి చేసిన అన్యాయని, దోపిడీని ప్రజలకి మనమే వివరించాలి,ప్రజల్లో చర్చ జరగాలి. కేంద్రం లో మరోసారి బీజేపీ తెలంగాణలో ఈసారి బీజేపీ అనే నినాదం ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలుకు వివరించి చెప్పాలి – కార్యకర్తలు మరింత పట్టుదలతో కష్టపడి పనిచేస్తే విజయం మనదే




