డోర్నకల్ ఫిబ్రవరి-12 /జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ జూపల్లి వెంకటరత్నండోర్నకల్ మండల జనం సాక్షి ప్రతినిధి బుక్య యువరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సీఐ జూపల్లి వెంకటరత్నం,జనం సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం వారుమాట్లాడుతూ…ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు.అలాగే అవినీతి అక్రమాలపై కూడా కథనాలు రాసి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభమని అని వర్ణించారు.ఈ కార్యక్రమంలో కొత్త దుబ్బ తండా సర్పంచ్ అజ్మీర లెనిన్ కుమార్, పోలీస్ సిబ్బంది లు, జర్నలిస్టు భూక్యా యువరాజు తదితరులు ఉన్నారు.





