Wednesday, 4 November 2026

చింతగుట్టలో భూమి పూజ.

 

 

 

 

సర్పంచ్ రజిత లక్ష్మణ్..శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 13భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారంp శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామంలో భూమి పూజ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజిత లక్ష్మణ్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల దైవమైన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తాడికల్ ఎంపిటిసి బుద్ధార్థి వరలక్ష్మి సంపత్, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, ఉప సర్పంచ్ కౌటం మహేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.