Tuesday, 3 November 2026

కేంద్ర బడ్జెట్‌ రూ. 17,77,477 కోట్లు

వచ్చే ఏడాది నుంచి జీఎస్‌టీ అమలు: అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 జ‌నంసాక్షి : రూ. 17,77,477 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళికేతర వ్యయం రూ.13 లక్షల కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.4.65 లక్షల కోట్లు.
 
బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :
– ద్రవ్యలోటు 3.96 శాతం
– వచ్చే ఏడాది నుంచి జీఎస్‌టీ అమలు
– కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 నుంచి 25శాతానికి తగ్గింపు
– స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ అంగీకరించింది
– నల్లధనం తగ్గించే యోచనలో భాగంగా పన్నుల విధానం
– విదేశాల్లో నల్లధనం దాచుకునే వారికి పదేళ్ల జైలుశిక్ష
– నల్లధనంపై 300శాతం జరిమానా
– నల్లధనాన్ని ప్రోత్సహించే బ్యాంకులు, సంస్థలపై జరిమానా
– బినామీ ఆస్తుల నిరోధానికి కొత్త బిల్లు
– రూ.లక్షకు మించి ఆస్తుల కొనుగోలుకు పాన్‌ నంబర్‌ తప్పనిసరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *