Tuesday, 3 November 2026

కాసేపట్లో యశోదా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్‌: మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరగనుంది. 45ఏళ్ల మహిళకు గుండెమార్పిడి ఆపరేషన్‌ చేసి పునర్జన్మ ప్రసాదించనున్నారు. 11మంది వైద్యులు 8గంటలపాటు ఈ చికిత్స నిర్వహించనున్నారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి గుండెను బెంగళూరు నుంచి నగరానికి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్‌లోని ఆస్పత్రి వరకు గ్రీన్‌చానల్‌ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుండె తరలింపులో ఐదుగురు హార్ట్‌ స్పెషలిస్ట్‌లు, మూడు అంబులెన్స్‌లు పాల్గొన్నాయి. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ గోఖలే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *