Thursday, 5 November 2026

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం.

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం.
ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు.
నెన్నెల, జనవరి 13, (జనంసాక్షి )
నెన్నెల మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఎంపీపీ సంతోషం రమాదేవి అధ్యక్షతన ఉదయం 10:30కి ప్రారంభం కావాల్సిన సమావేశం 12 గంటలకు ప్రారంభం అయింది. సమావేశంలో అధికారులు గత మూడు నెలల అభివృద్ధి నివేదకలు చదవడానికి మాత్రమే పరిమితం అయింది. సమావేశం మొత్తంలో మన్నెగూడెం, జంగాల్ పేటకు కొత్తగా వేసిన బీటి రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయని మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు, జంగాల్ పేట సర్పంచ్ రావుల సత్యనారాయణ సభ ద్రుష్టికి తీసుకువచ్చారు. బీటి రోడ్డు వేసిన నాలుగు రోజులకే తారు లేచి పోతుందని, మరీ నాసిరకంగా పనులు జరిగాయని, సంబంధిత అధికారికి ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి పనులకు సంబందించిన బిల్లులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీడీఓ వరలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ, నాయబ్ తహసీల్దార్ ప్రకాష్, వెటర్నరీ డాక్టర్ దిలీప్, ఎంపీవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గురునాదం సుమలత, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.