టీజేఎస్ ప్రధాన కార్యదర్శి కర్ణకంటి కిరణ్ కొండమల్లేపల్లి జనవరి 22 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ దేవరకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్ణకంటి కిరణ్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్ర పొద్దులో వెనుకబడిన వర్గాల బీసీల బతుకులలో నిలువెల్లా గాయాలమయమే తప్ప మార్పు ఏమీ రాలేదు, బీసీల బతుకులు ఇంకా బక్క చిక్కినవి తప్ప బాగుపడిది ఏమి లేదు అని ప్రభుత్వాన్ని విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు బీసీలకు కార్పొరేషన్ లోన్లను మంజూరు చేయలేదు, స్కాలర్షిప్, స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలు ఏమీ కూడా బీసీలకు ఉద్ధరించడానికి చేసింది ఏమీ లేదు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ తగ్గించారాని బీసిల కుటుంబంలో అంత ధనవంతం ఏం కనపడుతుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్ లో అత్యధిక దరఖాస్తు రుసుమును బీసీల పైన విధించడం వలన చాలామంది బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగులు కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ లకు దరఖాస్తు చేసుకోలేక అభాగ్యులుగా అవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ఉద్యోగ ,విద్య నోటిఫికేషన్లో బీసీల పైన దరఖాస్తు రుసుమును తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీల బాగు కోసం ఏమో చేస్తున్నామని చెప్పతూ వారిని రాజకీయంగా, ఉద్యోగపరంగా ఎదగకుండా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అనగదొక్కుతున్నారు అని విమర్శించారు బీసీల జనగణన చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన ఎందుకు చేయటంలేదని ప్రశ్నించారు మరియు బీసీలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగ,ఉపాధి,రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ స్టడీ సర్కిల సంఖ్యను పెంచాలని, పెండింగ్ లో ఉన్న బీసీ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ,బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 119 కులాలు ఉన్న బీసీలలో ఒక్కరిని అందలమ్ ఎక్కించినంత మాత్రాన అందరూ బాగుపడ్డారు అనడం గంజినీళ్ళ లో అన్నం వెతుకులాంటిదే అన్నారు బీసీ బందు ప్రకటించాలని, 50 సంవత్సరాలు పైబడిన కుల వృత్తుల వారికి పెన్షన్ ఇవ్వాలని మరియు కార్మిక భీమాను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంగిటి సత్యనారాయణ , సతీష్, ఈదయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు న్యాయం చేయాలి




