కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు : రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్
ఎల్బీనగర్ ( జనం సాక్షి ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఎల్బీనగర్ నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కేబుల్ ఆపరేటర్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ముఖ్య ఆథిదిగా హాజరైనారు . ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ ఈ గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరలో వినోదాన్ని అందిస్తున్న కేబుల్ ఆపరేటర్ ల పరిస్థితి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన అనేక ఇబ్బందులు పడుతున్న కేబుల్ ఆపరేటర్లు సొంత పెట్టుబడితో నడుపుతున్న ఎటువంటి కేబుల్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జి ఎస్ టి. , చానల్స్ ఎమ్ఆర్పి రూపకంగా పెట్టి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలపై పెను భారాన్ని పెడుతుందని అన్నారు . అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ డిటి హెచ్ , జియో తదితర మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి కేబుల్ ఆపరేటర్ల మనుగడ లేకుండా చేస్తున్నాయి 30 సంవత్సరాలు అతి తక్కువ ధరకు వినోదం ఇచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్ల ని సర్వీసులు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది ఇట్టి ప్రయత్నాలని కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా తిరిగి కొడతారని నూతన టెక్నాలజీని ప్రజలందరికీ అందించాలని అన్నారు . ప్రతి కేబుల్ ఆపరేటర్ ఫైబర్ టు హోమ్ చేసి ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఓటీటీ సర్వీసెస్ వాయిస్ ఓవర్ అన్ని సర్వీసెస్ ని అందించవలసిందిగా కేబుల్ ఆపరేటర్ అని కోరడమైనది ప్రతి ఆపరేటర్ గుర్తుంచుకోవాల్సిన విషయం టీవీ ఉన్నంతకాలం కేబుల్ ఆపరేటర్ ఉంటాడని అది మర్చిపోవద్దని ఆయన తెలియజేశారు గత 30 సంవత్సరాల ముందు కేబుల్ ఆపరేటర్ లే వినోదాన్ని అందించే వారు ఈరోజు అనేక మైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి కేబుల్ ఆపరేటర్లు ఉండనీ ఇవ్వకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని గుర్తుచేసారు. కేబుల్ ఆపరేటర్ అందరూ నూతన టెక్నాలజీని ప్రజలందరికీ ఇవ్వాల్సిందిగా ఆయన కోరాడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వినోదం అందించే విషయంలో కేబుల్ ఆపరేటర్ గడిచిన 30 సంవత్సరాల నుంచి అతి తక్కువ ధరలో వినోదాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రజల అవసరాలు అతి తక్కువ ధరకే కేబుల్ ఆపరేటర్లు వినోదాన్ని అందించగలరని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము గత 30 సంవత్సరాల నుంచి మీ సహకారానికి సదా కృతజ్ఞతలు రాబోయే కాలంలో నూతన టెక్నాలజీతో అతి తక్కువ ధరలో సర్వీసులు అందిస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడు ప్రకాష్ , ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఎల్బీనగర్ నియోజకవర్గం కి సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అయినది