విశాఖ: భారీ వర్షాలకు అనంతగిరి మండలంలో కిరండోల్-కొత్తవలస రైల్వే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
పునరుద్ధరణకు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. దీంతో రైల్వేకు రోజుకు రూ.25 కోట్ల నష్టం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు విజయనగం జిల్లా ఎన్‌కోట మండలం బొడ్డవరం సమీపంలో కేకే రైల్వే లేన్ వంద మీటర్లకుపైగా కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.




