వేమనపల్లి,మార్చి 12,(జనంసాక్షి):
వేమనపల్లి మండలంలోని నీల్వాయి కేజీబీవీని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,వసతులు మొదలగు సమస్యలపై విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం,స్నాక్స్, తదితర విషయాలపై ఆరాతీసారు.విద్యార్థులకు పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులు, మరుగుదొడ్లు,పరిసరాల పరిశుభ్రత,ఆరోగ్యం, చదువుపట్ల విద్యార్థులు కనబరుస్తున్న శ్రద్ధ పై అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని,వంద శాతం ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల బోధన సిబ్బందికి సూచించారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్ తండ్రి గుండయ్య దశదిన కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.పురాణం గుండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు రూలర్ సీఐ విద్యాసాగర్,స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ రుద్రబట్ల లక్ష్మీ నారాయణ, భీమగౌడ్,మాజీ కో అప్సన్ సభ్యులు హమీద్ ఖాన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




