Friday, 6 November 2026

కేటీఆర్‌కు రాజకీయ సన్యాసం ఖాయం

-బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు

– విూట్‌ది ప్రెస్‌లో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ

హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కేటీఆర్‌కు రాజకీయ సన్యాసం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. శనివారం విూట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం అని విమర్శించారు. బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. యువత కోరుకున్న ఉద్యోగాలు కేసీఆర్‌ ఇవ్వలేకపోయారన్నారు. కవిూషన్లకు కక్కుర్తి పడే నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీ పెద్ద పీట వేసిందని రమణ తెలిపారు. మహాకూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ నియంతృత్వమే కారణమన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలిస్తామని హావిూ ఇచ్చారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. మహాకూటమిలో మహిళలకు ప్రాధాన్యమిస్తామని ఎల్‌.రమణ స్పష్టం చేశారు. నాలుగేళ్లలో కేసీఆర్‌ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అమరుల ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణను నాలుగేళ్లలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దోచుకున్నారని విమర్శించారు. కేవలం హావిూలకే కేసీఆర్‌ పాలన పరిమితమైందని, చేతల్లో ఎక్కడా కనిపించలేదని అన్నారు. మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణాలు, మిషన్‌ కాకతీయ ఇలా ప్రతీ పథకంలోనూ అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఈ పథకాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు కవిూషన్ల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనను చూశారని, కేసీఆర్‌ నియంతృత్వ పోకడకు విసిగిపోయారని రమణ తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకుసిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందని రమణా ధీమా వ్యక్తం చేశారు.