బెల్లంపల్లి, మే 2, ( జనంసాక్షి )ఈనెల 8న బెల్లంపల్లి పట్టణానికి వస్తున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 10 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, 150 కోట్ల నిధులతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంటుందని, అనంతరం నెం 2 మైదానంలో బహిరంగ సభ ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి సంబంధిత అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, Sheets హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




