Tuesday, 3 November 2026

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి – రోడ్డెక్కిన రైతులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్

 

 

 

 

 

నాయకులు జనంసాక్షి , రామగిరి : అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య, మంథని అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, కల్వచర్ల ఎంపిటిసి కొట్టే సందీప్ లు డిమాండ్ చేశారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో అకాల వర్షంతో ఐకెపి కేంద్రాల్లో తడిచిన వడ్లను ఆరపోసి మాచర్ వచ్చినా కూడా అధికారులు, మిల్లర్లు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వడ్లను కొనుగోలు చేయక పోవడంతో రైతులు రోడ్ ఎక్కి ఆందోళన చేపట్టారని అన్నారు. రైతులకు మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వచర్ల పెద్దపల్లి మంథని రోడ్డుపై రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయమైన మద్దతు ధర ఇవ్వాలని వర్షంతో కొట్టుకుపోయిన వడ్లకు, పొలాల్లో నేలకొరిగిన పంటలకు రైతులకు నష్టపరిహానాన్ని అందించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని యెడల కాంగ్రెస్ పార్టీ పక్షాన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నాయకత్వంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రనరి కాలనీ టౌన్ అధ్యక్షులు కాటం సత్యం, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, కన్నూరీ శ్రీనివాస్, వార్డ్ మెంబర్ రవీందర్, మెట్టు ప్రభాకర్, శ్రీనివాస్ సిద్ధం రామనారాయణ తాటి సతీష్ శ్రీధర్ సంపత్ రేండ్ల కుమార్ రేండ్ల రమేష్ రేపెల్లి శ్రీను బండ తిరుపతి మంగళవారపు రాజయ్య ఊదరి రాజయ్య తోట శంకర్ కొలిపాక మల్లయ్య అధిక సంఖ్యలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.