Wednesday, 4 November 2026

కేబినేట్‌ విస్తరణపై తొలగిన అనుమానాలు

19న ముహూర్తం పెట్టిన సిఎం కెసిఆర్‌
మాఘపౌర్ణమి సందర్బంగా ప్రమాణానికి ఏర్పాట్లు
రాజ్‌భవన్‌ వేదికగా ప్రమాణస్వీకారం
గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ భేటీ
22నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కేబినెట్‌ విస్తరణపై శుక్రవరాం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి రెండు నెలల సుదీర్ఘ కాలం తరవాత మంత్రివర్గ విస్తరణకు కెసిఆర్‌ శ్రీకారం చుట్టబోతున్నారు.
డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడయ్యాక 13న కెసిఆర్‌తో పాటు మహ్మూద్‌ అలీలు ప్రమాణం చేశారు. దాదాపు రెండు నెలలకు పైగా సిఎంకెసిఆర్‌ శాఖల మధ్య సమన్వయానికి కసరత్తుచేస్తున్నారు. శాఖలను సమన్వయం చేయడం ద్వారా ఒక్క చోటకు తీసుకునిరావాలన్న భావనతో విస్తరణకు జాప్యంచేశారు.   ప్రస్తుతానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ¬ం, అగ్నిమాపక శాఖ మంత్రిగా మహమూద్‌ అలీ మాత్రమే పదవీ బాధ్యతలు చేపట్టారు. మిగతా శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. ప్రధానమైన ఆర్థిక శాఖను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా కొత్త బ్జడెట్‌ను ఆమోదించు కోవాలి. అయితే ఎంత మందిని మంత్రివర్గంలోకి తసీఉకుంటారు..సామాజిక సవిూకరణాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. కెటిఆర్‌,హరీష్‌ రావులకు స్థానం ఉంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. విస్తరణ తరవాతనే అందుకనుగుణంగా ఫిబ్రవరిలోనే బ్జడెట్‌ సమావేశాలను నిర్వహించాలి. ఈ సమావేశాలు ఎప్పుడెప్పుడా అన్న చర్చ జరుగుతూ వచ్చింది. చివరకు బ్జడెట్‌ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో ఈసారి బ్జడెట్‌ను సమర్పించేది ఎవరు? మంత్రివర్గ విస్తరణ జరగకపోతే పరిస్థితి ఏమిటి? ఆర్థిక శాఖకు మంత్రి లేకపోతే ఎవరు ప్రవేశపెడతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా క్యాబినేట్‌ విస్తరణ తేదీని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. తెలంగాన ఏర్పడ్డ తరవాత ఇప్పటి వరకు ఈటెల రాజేందర్‌ ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్‌ సమర్పిస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు ఎవరికి ఆ అవకాశం దక్కబోతుందో చూడాలి.  ఈసారి ముఖ్యమంత్రి కేసీఆరే శాసనసభలో బ్జడెట్‌ను ప్రవేశపెడతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే కేబినేట్‌లో ఎవరికి ఆర్థిక శాఖ కేటాయిస్తారో ఇక వారే బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 22న ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మరునాడు శనివారం బ్జడెట్‌పై చర్చ జరుగుతుంది. ఆదివారం సెలవు. తిరిగి 25న సభ ప్రారంభమవుతుంది. ఆ రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ
ఆమోదం తెలుపుతుంది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడుతుంది. 22న బ్జడెట్‌ను సీఎం కేసీఆరే ప్రవేశపెడతారన్నది ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నెల 19న మంచి ముహూర్తం ఉందని గుర్తించిన సిఎం కెసిఆర్‌ గవర్నర్‌తో కలసి విషయం చర్చించారు. ఈ మేరకు ప్రకటన
విడుదల చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికైనా ఆర్థిక శాఖను కేటాయిస్తే… ఆ మంత్రే బ్జడెట్‌ను ప్రవేశపెడతారు. మంత్రివర్గ విస్తరణ జరిగి, ఎవరికీ ఆర్థిక శాఖను కేటాయించకపోతే… ఇతర మంత్రుల్లో ఎవరినైనా బ్జడెట్‌ను ప్రవేశపెట్టాల్సిందిగా కేసీఆర్‌ పురమాయించే అవకాశాలున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి మధ్యంతర బ్జడెట్‌నే ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున… 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలో పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెట్టుకునే అవకాశం ఉంది. కేంద్రంలో మధ్యంతర బ్జడెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల, లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం జూన్‌ లేదా జూలైలో పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడుతుంది. అప్పుడు ఆ ప్రభుత్వ ప్రాథమ్యాలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ దృష్ట్యా… ఇప్పటికైతే రాష్ట్రంలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశపెట్టుకుందామని, దానికగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత… అందులో రాష్ట్రానికి  వచ్చే పన్నుల వాటా, గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌, సీఎస్‌ఎస్‌ల కేటాయింపులు తెలుస్తాయని చెప్పారు. వాటిని చూసుకుని, రాబడుల అంచనాలతో సమగ్ర బ్జడెట్‌ను ప్రవేశపెట్టుకుందామని తెలిపారు. దరిమిలా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బ్జడెట్‌నే రూపొందిస్తున్నారు. రాసన సభ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తెచ్చింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇక స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(ఎస్‌ జీఎస్‌ టీ) చట్టానికి సంబంధించి ఇటీవల సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు సభ ఆమోదం పొందాల్సి ఉంది. రైతు ఉపశమన కమిషన్‌ చట్ట సవరణ బిల్లునూ ఆమోదించాల్సి ఉంది. ఈ మూడు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.