హైదరాబాద్,ఆగస్ట్28(జనం సాక్షి): ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లుతున్న కేరళకు తెలంగాణ ఆపన్న హస్తం అందిస్తోంది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యావత్ తెలంగాణ కదిలింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో కేరళ రాష్టాన్రికి టీఎస్ జెన్కో సంస్థ విద్యుత్ పరికరాలు, విూటర్లు పంపిస్తోంది. ఈ ట్రక్కులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. కేరళ రాష్ట్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వరదలు తగ్గినా సాధారణ పరిస్థితికి రాలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




