Tuesday, 3 November 2026

కేశూబాయ్‌ కొత్త పార్టీ

గాంధీనగర్‌: గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూబాయ్‌ పటేల్‌ కొత్త పార్టీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో గుజరత్‌ పరివర్తన్‌ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. తమ పార్టీ దేశ సమగ్రత, ఐక్యత కోసం గుజరాత్‌ రాష్ట్ర సమగ్ర అభివృద్ది కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. ఆయన గుజరాత్‌ గుర్తింపును నాశనం చేసేంరుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయన పార్టీ రాష్ట్రంలోని 182 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పటేల్‌ జనాభా ఎక్కువగా ఉన్న సౌరాష్ట్ర, కచ్‌, సూరత్‌, దక్షిణ గుజరాత్‌ల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *