Monday, 2 November 2026

కేశోరాం కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – సీఈఓ రాధాకృష్ణన్ తో చర్చించిన కేశోరాం కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షులు, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

జనంసాక్షి , కమాన్ పూర్ :కేశోరామ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన సీఈవో శ్రీ రాధాకృష్ణ గతో సీఎంఓ యూ వి రాజుతో కాంట్రాక్టు కార్మికుల పలు డిమాండ్ల పైన చర్చించిన గౌరవ అధ్యక్షులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కేశోరామ్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్,సీఈవో రాధాకృష్ణ, సీఎమ్ఓ వెంకటరమతి రాజు సానుకూలంగా స్పందించి యూనియన్ కాలపరిమితి లోపు కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు నెరవేరుస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి వెంట ప్లాంట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, ఏవీపీ హెచ్ ఆర్ మేనేజర్ గోవిందరావు, ఐ ర్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకి కేశోరామ్ యజమాన్యం ఘనంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో దాడి పొచమల్లు, తలారి శంకర్, రేడపక మల్లేశం,దేవి శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్, కలవెన కొమురయ్య, మెరుగు అశోక్, కలవేన మల్లేశం, కలవేన స్వామి కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.