Monday, 2 November 2026

మారం సత్తయ్యకు ఘనంగా వీడ్కోలు

వేములవాడ రూరల్, జూన్ 30 (జనంసాక్షి):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిపల్లిలో అటెండర్ గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న మారం సత్తయ్యకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సర్పంచ్ బాలకిషన్, బత్తిని ఎల్లయ్య, నరేష్, విద్యా కమిటీ చైర్మన్ వంగ తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా మహేష్, ఉపాధ్యాయులు రమేష్, చక్రపాణి, శ్రీనివాస్, సంజీవరెడ్డి, రమ, శ్రీధరాచారి, గ్రామస్థులు రాజు తదితరులు పాల్గొన్నారు.