జనం సాక్షి , మంథని : రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 28 సబ్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్
రెమారాజేశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మంథని ఎస్సైగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ కు బదిలీ కాగా అతని స్థానంలో టాస్క్ ఫోర్స్ మంచిర్యాలలో పనిచేస్తున్న మధుసూదన్ ను మంథని కి బదిలీ అయ్యారు. కమాన్పూర్ ఎస్సైగా పనిచేస్తున్న షేక్ మస్తాన్ రామగుండం విఆర్ కు బదిలీ కాగా అతని స్థానంలో ముత్తారం ఎస్సైగా పనిచేస్తున్న బేతి రాములు బదిలీపై రానున్నారు.
మంథని ఎస్ఐగా మధుసూదన్ రావు, కమాన్పూర్ ఎస్సైగా బేతి రాములు




