– ఉద్యమం సమయంలో ఒకలా ఇప్పుడొకలా మాట్లాడుతున్నాడు
– ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
– కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్లే
– కేసీఆర్కు పరాభవం తప్పదు..
– ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ఉంటుంది
– తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, అక్టోబర్7( జనం సాక్షి) : సీఎం కేసీఆర్ను చూసి ఊసరవెల్లిసైతం సిగ్గుపడేలా ఉందని, ఉద్యమ సమయంలో ఒకలా.. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు దసరా, విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన లక్ష్మన్, చెడుమిధ మంచిని జయించిన
రోజు విజయదశమి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోసైతం చెడును జయించాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు ఒక మాట…సీఎం అయ్యాక ఒక మాట మాట్లాడుతున్నారని, రంగులు మార్చే ఊసరవెల్లి తరహాలో సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయని విమర్శించారు. కులవృత్తుల పై ఆధారపడే ప్రజలు సైతం పోరాటం చేసి తెలంగాణ సాదించుకున్నారని అన్నారు. యూటర్న్ తీసుకున్న సీఎంలకు ఎలాంటి పరాభవం దక్కిందో అలాంటి పరిస్థితి కేసీఆర్ కి దక్కబోతుందుని లక్ష్మణ్ హెచ్చరించారు. ఏపీలో జరిగిన సంఘటన తెలంగాణలో పునావృత్తం అవుతుందని, ఆర్టీసీ కార్మికుల పై సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కునట్లే నని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకుఇచ్చే జీతాలు సీఎం కేసీఆర్ జేబు నుంచి ఇవ్వడం లేదని తెలుసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల టాక్స్ లను తగ్గిస్తే లాభాల బాటలో నడుస్తుందని, కేసీఆర్ ఉద్యములో అన్నది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అన్న కేసీఆర్ కార్మికుల గుండెల్లో గుణపాలు గుచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దసరా పండుగరోజు ఆర్టీసీ 50వేల కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేసారన్నారు. దళిత సీఎం నుంచి మోదులుకుంటే నేడు ఆర్టీసీ కార్మికుల పై తీసుకున్న ప్రతి నిర్ణయంలో సీఎం మటతప్పారన్నారు. ఆర్టీసీ అప్పుల్లో ఉండడానికి ప్రభుత్వం, యాజమాన్యమే కారణమని, టాక్స్ ల పేరువిూద వందల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ నుంచి తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత బస్ పాస్ రియంబర్స్ మెంట్ వందక కోట్లు బకాయిలు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే చెల్లింపు జరిగిందన్నారు. బీజేపీ పాలిత రాష్టాల్ల్రో వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. నెల రోజుల ముందు సమ్మె నోటీసులు ఇస్తే ముందే ఎందుకు ప్రభుత్వం, యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ జేఏసీతో చర్చలకోసం ఒక్క గంట సమయం ఎందుకు కేటాయించలేదని, ఎందుకు 1లక్ష కోట్లకు పైగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను ఎవరికి అప్పగించడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చుతుపెట్టుకొని బంగారు తెలంగాణ ఎలా చేస్తారన్నారు. అమరులకు నివాళ్ళు అర్పించే హక్కు కార్మికులకు లేదా అంటూ లక్ష్మణ్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితులు లేవువని, ఈ ప్రభుత్వ పతనానికి ఆర్టీసీ ఉద్యమం నాంది కాబోతుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉందని, న్యాయపరంగా సైతం ముందుకు వెళ్తుందని, ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు తెలంగాణ మిత్రులు అయ్యారని, ఉద్యమ ద్రోహులు కేసీఆర్ కి మిత్రలు అయ్యారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంఘాలు లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఎండేవాడని ప్రశ్నించారు.ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ రంగులు మార్చే ఊసరవెల్లి




