Thursday, 5 November 2026

కేసీఆర్ అందరివాడు.

అశోక్ పటేల్ నాల్చర్ రాజు
బిచ్కుంద మార్చి 20 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంతో పాటు మండలానికి చెందిన తక్కడ్పల్లి, ఎల్లారాం,పత్లాపూర్, శాంతాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను ఎంపీపీ అశోక్ పటేల్ మరియు జడ్పిటిసి నాల్చర్ భారతీ రాజు చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అసద్ అలీ, మండల భారాస పార్టీ అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, సర్పంచులు మేకల పుండ్లిక్, కృష్ణారెడ్డి, ఆకుల సాయిలు, ఎంపీట