బిచ్కుంద ఏప్రిల్ 12 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాల్చర్ రాజు, అశోక్ పటేల్, అసద్ అలీ, వెంకటరావు దేశాయ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




