Wednesday, 4 November 2026

కేసీఆర్ అందరివాడుదడ్గి సర్పంచ్ ఆకుల సాయిలు

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 20 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గల పెద్ద దడ్గి గ్రామంలో గురువారం నాడు షాదీ ముబారక్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.