Wednesday, 4 November 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన హామీలు నెరవేర్చి న తర్వాతనే వరంగల్ లో పర్యటించాలి..! -మండల సర్పంచ్ల ఫోరం

 

జనం సాక్షి సైదాపూర్/ తెలంగాణ రాష్ట్రం విభజించినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన అనంతరమే ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా పర్యటన చేయాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కార్యదర్శి చందా శ్రీనివాస్, కాయిత రాములు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చి ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి పార్టీ ,ప్రధాన నరేంద్ర మోడీ విధానం అరచేతిలో బెల్లం పెట్టి మోచేత్తో నాకిచ్చే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తక్షణమే విభజన హామీలపై ప్రకటన చేసి వరంగల్లో పర్యటించాలని వారు కోరారు. దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇదేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 25 శాతం ఖాళీలు ఉన్నాయని భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం వేడుక చూస్తుందని మండిపడ్డారు .దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలను కూడా ఒప్పంద ఉద్యోగాల తో నడుపుతూ కాలం వెళ్ళదిస్తుందని, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల ను లెక్క కడితే ఇప్పటివరకు 9 సంవత్సరాల్లో 18 కోట్ల ఉద్యోగాలను నిరుద్యోగులు కల్పించి తిరగాలని వారు డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చడంతో పాటు కేంద్రంలోని బిజెపి పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు,బిజెపి పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని వారు హెచ్చరించారు.