Wednesday, 4 November 2026

కేసీఆర్ తెలంగాణ జాతి పిత..

వరంగల్ బ్యూరో, జూన్ 06 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా  మంగళవారం తెలంగాణ పారిశ్రామిక విజయోత్సవ కార్యక్రమంలో బాగంగా కొత్తవాడ పద్మశాలి కమ్యూనిటీ హాల్ నుండి దేశాయిపేట కే ఆర్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,మేయర్ గుండు సుధారాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అదే ఆ ర్యాలీలో చేనేత పనిముట్లతో ప్రదర్శనగా కే ఆర్ గార్డెన్స్ వరకు వెళ్లారు. తదనంతరం కేఆర్ గార్డెన్స్ లో పారిశ్రామిక విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేశారుఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,మేయర్ గుండు సుధారాణి,కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్స్ శ్రీ వాస్తవ్,అశ్విని,స్టేట్ హెల్త్ కమిటీ డైరెక్టర్ హరి రమాదేవి,ఆర్డీవో మహేందర్,అధికారుకు,మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ,చేనేత పెద్దలు,చేనేత కార్మిక నాయకులు,వివిధ డివిజన్ల కార్పొరేటర్,చేనేత లబ్ధిదారులు హాజరయ్యారుఈ సందర్భంగా చేనేత మరియు ప్రభుత్వ ద్వారా లబ్దిపొందిన పలువురు వారు పొందిన లబ్ది వల్ల చేకూరిన లాభాన్ని వేదిక ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…

తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత పరిస్థితి ఎట్లా ఉండేది అనేది మన కళ్ళముందు ఉంది

10సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది

గతంలో వరంగల్ తూర్పు అంటే అజాంజాహి మిల్స్,ఎనమాముల మార్కెట్ అనే వారు
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అజాంజాహి మిల్స్ ను అమ్ముకున్నది
4వేల మంది కార్మికులను రోడ్డున పడేసారు
గతపాలకులు కార్మికుల పొట్టకొట్టి అజంజాహి మిల్స్ అమ్మితే ఆ కార్మికులకు నేడు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం 319 మందికి స్థలాలను కేటాయించడం జరిగింది

అజాంజాహి మిల్స్ నడపడానికి గతపాలకులకు చేతకాక,దమ్ము లేక అమ్ముకున్నారు
కానీ నేడు కేసీఆర్,కేటీఆర్ నాయకత్వనా తెలంగాణ ప్రభుత్వం సంగంలో 1200వందల ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం
టెక్స్ట్ టైల్ పార్కులో వరంగల్ నుండి 10వేల మందికి ఉద్యోగ దొరకబోతుంది
కేసీఆర్,కేటీఆర్  మరియు అందరి సహకారంతో టెక్స్ట్ టైల్ పార్కు బస్సులు పెట్టి చూపించి మన ప్రభుత్వం చేస్తున్న ప్రగతిని నివేదిస్తాం ఉపాధిని కల్పిస్తాం
తెలంగాణ రెండో రాజధాని,పెద్ద నగరం వరంగల్ అని చెప్పే కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలు ఒక్క కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడం చేతకాలేదు
తెలంగాణలో అతి పెద్ద రెండో నగరంగా ఉన్న వరంగల్ ను గతపాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు
కేటీఆర్  నేతృత్వంలో చేనేత వాడల్లో కొత్త పుంతలు తీసుకొని వచ్చి వారి బతుకుల్లో వెలుగులు నింపడం జరిగింది
కేసీఆర్ గారి నాయకత్వనా, కేటీఆర్ గారి చొరవతో కొత్తవాడ చేనేత పరిశ్రమ గొప్పగా విలసిల్లుతున్నది
కొత్తవాడ కార్మికులకు నేత పని తప్ప మరే మని చేయలేరు వారు దానిపై ఆధారపడి బ్రతుకుతున్నారు వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంది
కేసీఆర్,కేటీఆర్ మార్గనిర్దేశంలో తాను మేయర్ గా ఉన్నప్పుడు కొత్తవాడ నేతన్నల ఆగం కావద్దని వారు తయారు చేసిన కార్పెట్స్,బెడ్ షీట్స్ గోదాం లో ఉంచి ఖరీదు చెపియ్యడం జరిగింది
నేతన్నకు భరోసా కల్పించాలని వారం క్రితం కొత్తవాడ నేతన్నలకు చేనేత భీమా 12వందల మందికి అందించడం జరిగింది
ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలో 35 శాతం కార్మికులకు,5 చేనేత సొసైటీలు పొందుతున్నాయి
కార్మికులకు సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది
నేడు నేతన్నల,పరిశ్రమలు నడిపేవారరు రెండు నెలలకు ఒకేసారి ప్రభుత్వం ద్వారా ఖరీదు చేయాలని కోరారు

కేసీఆర్ కేటీఆర్ దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా రెండు నెలలలకు ఖరీదు చేయించే జిమ్మేదారి తీసుకుంటాను59 సంవత్సరాల లోపు వయసు గల నేతన్నలకు చేనేత బీమా వర్తిస్తుంది 59 సంవత్సరాలుపై బడిన వారికి లేబర్ కార్డు అందిస్తాం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సర్కారును ఆశీర్వదించాలి అని ఎమ్మెల్యే కోరారు