ఎల్కతుర్తి జూన్ 5 జనం సాక్షిఎల్కతుర్తి మండలం సూరారం పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది వివరాల్లోకి వెళితే పెంచికలపేట గ్రామానికి చెందిన పెరుమాండ్ల పెద్ద రాజయ్య వెహికల్ నెంబర్ ఏపీ 37 ఈ హెచ్ 1056 ఫ్యాషన్ ప్రో బండి పైన ఎల్కతుర్తి బ్యాంకు పని నిమిత్తము వచ్చి పని ముగించుకొని తిరిగి మళ్ళీ పెంచికలపేటకు వెళుతుండగా సూరారం పెట్రోల్ బంక్ వద్ద లారీ నంబర్ ఎన్ ఎల్ జీరో వన్ ఎ ఎస్ 3167 గల లారీని కుడి పక్క నుండి దాటుతుండగా లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగినది ఈ ప్రమాదంలో పెరుమాండ్ల పెద్ద రాజయ్యను వారి వెంట ఉన్న అబ్బాయి లక్ష్మణుకు కుడి కాలుకు దెబ్బ తగలడం వలన ఇద్దరినీ 108 వెహికల్ లో చికిత్స నిమిత్తము ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా రాజయ్య మార్గమధ్యలోనే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు లక్ష్మణుకు ప్రధమ చికిత్స చేసి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు ఈ లారీ డ్రైవర్ శ్రీనివాస్ యాదవ్ సన్నాఫ్ శ్రీ పాల్ యాదవ్ వీరు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు
సూరారం పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి




