ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని ఎర్రవలి చౌరస్తాలో శుక్రవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎంపీపీ స్నేహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా శాసన మండల సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ లు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటం ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, రజాకార్లు నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిందని, అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది అన్నారు. జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మన వంతు పాత్ర ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృషి, క్రమశిక్షణతో మన భావితరాలకు మార్గానిర్దేశకత్వం చేసిన వారమావుతామన్నారు. న్యాయ వ్యవస్థలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణకు మంచి పేరు తీసుకుని వస్తాం అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక, పేద తేడా లేకుండా సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మంద శ్రీనాథ్, ఇటిక్యాల జడ్పిటిసి హనుమంత్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.




