కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 02 ఓల్డ్ బోయిన్ పల్లి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్యాలయం లో సాయి సాగర్ ఎంక్లేవ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మొదటగా స్వర్ణధామ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని స్వర్ణధామ నగర ఆర్ఆర్ నగర్, ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్,సాయి సాగర్ ఎంక్లెవ్,అలీ కాంప్లెక్స్, ఫాతిమా మసీదు ప్రాంతాలలో సీవరేజ్ పైప్ లైన్, డ్రైనేజీ పనులు,రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయనున్నట్లు తెలిపారుఅనంతరం సాయి సాగర ఎంక్లేవ్ లో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు.. నాలా విస్తరణ పనుల కారణంగా రహదారి మూసివేయడంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వేది కుక్కల బెడదతో పాటు సీసీ కెమెరాలు లేకపోవడం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే త్వరగా తిను పనులను పూర్తి చేసి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపాలని కోరగా ఎమ్మెల్యే వారికి సానుకూలంగా హామీ ఇచ్చారు.ఆగస్టులోగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ను సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్ పల్లి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, కర్రె జంగయ్య, ఇజాజ్,మన్నె ఉదయ్,యాదవ్ గడ్డం నర్సింగ్ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్,మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాంగిర్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమల్,ఖదీర్, చారి, పోచయ్య, గణేష్, ఉదయ్, బాలరాజ్, జెకె,శివ,ప్రశాంత్, ప్రవీణ్, గణేష్ కుమార్,అరుణ్,శశికళ, సంతోషి,ఉమా,రోజా,దేవి,సుమా, పద్మలత,పద్మ,ఉమ,అనురాధ,కమల మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా ఆవిర్భావ, దశాబ్ది ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మొత్తం నరసింహ యాదవ్




