Wednesday, 4 November 2026

కేసీఆర్ నాయకత్వనా బ్రహ్మాండంగా అభివృద్ధి

 

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, జూన్ 7 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు తెలంగాణ సాగునీటి దినోత్సవం కార్యక్రమం ఆటోనగర్ లక్ష్మిగార్డెన్స్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరవగడిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,ఆర్డీవో మహేందర్,కార్పొరేటర్లు కావటి కవిత రాజు యాదవ్,దిడ్డి కుమారస్వామి,భోగి సువర్ణ సురేష్,సురేష్ జోషి, యేలుగం సత్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉంది నేడు ఎట్లా ఉంది అని మన కళ్ళముందు కనపడుతుందినాడు నీటి కోసం గోసలు పడ్డాం…పంటలకు నీరు లేక ఒక్క పంట పండించడానికి రైతు అల్లాడి పోయేవారు కానీ నేడు ఎంత గొప్పగా నీరు అందుతున్నది అనేది మనకందరికీ తెలుసుతూర్పు నియోజకవర్గంలో 575కోట్లతో ఇంటింటికి నల్లా ఇవ్వడం జరిగిందిసాగునీటి ద్వారా 10కోట్లతో వడ్డేపల్లి,కొత్తపేట,గుండు చెరువు,ఉర్సు,బెస్తం చెరువులు అభివృద్ధి చేసాం,మరికొన్ని చేస్తున్నాంచెరువుల పునరుద్దరణ జరిగితే అన్ని కాలాలలో నీళ్లు సమృద్ధిగా ప్రజలకు అందుతాయి అనే గొప్ప ఆలోచనతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి నేడు ఆ ఫలితాలను పొందుతున్నాంమనిషిని నిత్యం అన్నం లేకపోయినా ఉంటాడేమో కానీ నీరు లేకుండా ఉండలేరుకేసీఆర్ రాబోయే రోజుల్లో నీటి అవసరాన్ని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలో మూడు పంటలకు నీరు అందించి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారుఎస్సారెస్పీలో వచ్చే నీటిని గతంలో మన నియోజకవర్గానికి త్రాగునీరుగా వాడుకునే వారు నేడు త్రాగు నీరు సమస్య తీరింది నేడు అదే ఎస్సారెస్పీ నీటిని సాగు నేరుగా వాడుకుంటున్నాం బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారుచెరువుల పునరుద్దరణ,మంచి నీరు అందించడం అనేది కేసీఆర్ నాయకత్వనా సాధ్యమైంది తప్ప గతపాలకులకు చేతకాలేదుగతంలో మనకు మూడు రోజులు ఒకసారి నీళ్లు వచ్చేవి నేడు ఆ దుస్థితి లేదుమిషన్ భగీరద ద్వారా రూపాయి నల్లా ఇచ్చిన చరిత్ర కేవలం కేసీఆర్ గారిదితెలంగాణ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేసీఆర్ నాయకత్వన నడుస్తున్నాంతెలంగాణ ప్రభుత్వం మత్స కారులకు చేప పిల్లలలను అందిస్తున్నారు
చెరువు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది
కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న వడ్డే పల్లి చెరువును,కొత్త చెరువును కబ్జా చేశారుకేసీఆర్ అన్ని రకాలుగా సబ్బండవర్గాలను ఆదుకుంటున్నారుసంక్షేమంలో ఆసరా,కేసీఆర్ కిట్,చేప పిల్లలు,గోర్లు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్కుంటున్న మహా నాయకుడు కేసీఆర్
తిన్న రేవును తలవాలంటరు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు యాదిపెట్టుకొని కేసీఆర్ వెంట నిలబడాలినియోజకవర్గ ప్రజలకు అతి త్వరలో డబల్ బెడ్ రూమ్ అందిస్తాందళిత బంధు 1100వందల మంది ఇస్తాంగృహాలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ప్రజలకు 3లక్షల రూపాయలు అందించబోతున్నాం
పేద ప్రజలకు ఎం కావాలో కేసీఆర్ తెలుసుతెలంగాణ ప్రభుత్వం,కేసీఆర్ గారిని ఎవ్వరు మరవద్దు ఆయన వెంట నిలబడి చేసిన ప్రగతిని సంక్షేమాన్ని వివరించాలి