జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో ని సింగరేణి ప్రభావిత ఎస్సీ కాలనీ నివాసులకి నూతనంగా నిర్మించుకునే ఇళ్లకు వసతులు కల్పించాలని ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ ని సర్పంచ్ దాసరి శంకరయ్య కోరగా నూతనంగా నిర్మించబోయే ఇళ్ల కొరకు సర్పంచ్ దాసరి శంకరయ్య పర్య వేక్షణలో మట్టి రోడ్లు, కరెంట్ పిల్లర్స్ వేయించి పవర్ సప్లై పనులు చేపట్టారు. తాము కోరిన వెంటనే పనులు చేపట్టిన ఆర్జీ వన్ జిఎం శ్రీనివాస్, ఎస్ఎస్సిఎల్ కరెంట్ ఏఈ శ్రీనివాస్ కి సర్పంచ్ శంకరయ్య ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ సరఫరా పనులు చేపట్టిన సింగరేణి




