Wednesday, 4 November 2026

జిల్లా స్థాయి కవి సమ్మేళనము వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ జూన్ 7 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 11న ఆదివారం జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాయంత్రం 5:00 గంటలకు జిల్లాస్థాయి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తిగల కవులు, రచయితలు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణలో సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ కవి సమ్మేళనం తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో పాల్గొనదలచిన వికారాబాద్ జిల్లాలోని కవులు రచయితలు తమ కవితలను స్వీయ కవితగా ధ్రువీకరిస్తూ ఈనెల 9వ తేదీ వరకు శుక్రవారం సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ సూచించారు. కవితలు పద్యం, గేయం, వచన కవిత వివిధ ప్రక్రియలలో ఉండవచ్చన్నారు. కవిత గానం 3 నిమిషాలలో పూర్తయ్యే విధంగా తమ కవితలు ఉండేలా కవులు జాగ్రత్తలు వహించాలని అన్నారు.