Thursday, 5 November 2026

కైట్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకున్న అఫ్జల్ ఖాన్

కైట్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకున్న అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేట గురుకుల మైనారిటీ పాటశాల విద్యార్థులు మంచి ఉత్తమ ర్యాంకులు సాధించటం గొప్ప విషయమని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. శుక్రవారం శామీర్ పేట లో ని గురుకుల మైనారిటీ పాటశాల,కళాశాల ప్రిన్సిపాల్ క్రిష్ణ అఫ్జల్ ఖాన్ ను కలిసి జనవరి 18 వ తేదీన జరిగే కైట్ ఫెస్టివల్ 2023 కు ఆహ్వాన పత్రిక ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ క్రిష్ణ మాట్లాడుతు.. మైనారిటీ పాటశాల,కళాశాల లో 5వ తరగతి నుండి 8 వ తరగతి వరకు అడ్మీషన్లు ప్రారంభం అయినట్లు తెలిపారు. పాటశాల విద్యార్థులను చేర్పించుటకు సహకరించాలని ప్రిన్సిపాల్ క్రిష్ణ అఫ్జల్ ఖాన్ ను కోరగా దానికి అఫ్జల్ ఖాన్ సానుకూలత వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి పౌష్టికాహారం తో పాటు మంచి విద్య నందిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి అఫ్జల్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆలన,పాలన చూస్తున్న ప్రిన్సిపాల్ క్రిష్ణ ను అఫ్జల్ ఖాన్ అభినందించారు.ఈ కార్యక్రమం లో అఫ్జల్ ఖాన్, క్రిష్ణ తో పాటు ఉపాధ్యాయులు సామ్యుల్, ఫయాజ్, కుమార్,ఇమ్తియాజ్ అహ్మద్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
14ఎస్పీటీ -1: ఆహ్వానం అందజెస్తున్న మైనర్టీ ఉపాధ్యాయులు