Thursday, 5 November 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు సంగమేశ్వర పటేల్

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు సంగమేశ్వర పటేల్

రాయికొడ్ జనవరి 14 జనం సాక్షి రాయికొడ్ మండల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి రైతు సోదరులకు ప్రజా ప్రతినిధులకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు సంగమేశ్వర పటేల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతు సోదరులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు మరియు మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని అన్నారు..తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.