ప్రమాద బీమా చెక్ అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని 17వ వార్డ్ చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లికార్జున్ కొత్త బస్టాండ్ సమీపంలో ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో మృతి చెందాడు.ఏల్పుల మల్లికార్జున్ కు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో కార్యకర్తల ప్రమాద భీమా పథకం ద్వారా రూ.2 లక్షలు ఇన్సూరెన్స్ లభించింది.జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో ఏల్పుల మల్లికార్జున్ భార్య లక్ష్మీకి రూ.2 లక్షల చెక్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ లు, మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్, నాయకులు రేగట్టి సైదులు, బైరబోయిన మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.




