Wednesday, 4 November 2026

కైరళి విద్యార్థులకు గుంటూరు రైల్వేశాఖ ప్రశంసా పత్రాలు

మిర్యాలగూడ, జనం సాక్షి: పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఏప్రిల్ 8న వందే భారత్ రైలు మిర్యాలగూడ స్టేషన్ కు వస్తున్న సందర్భంగా నృత్యాలు చేస్తూ రైలుకు స్వాగతం పలికిన సందర్భంగా గుంటూరు రైల్వేశాఖ వారు ప్రశంసా పత్రాలు ఇచ్చారని కరస్పాండెంట్ షేక్. అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే భారత్ ట్రైన్ ఏప్రిల్ 8 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఆగటం జరిగింది. దీని పురస్కరించుకుని కైరళి పాఠశాల విద్యార్థులు సుమారు 40 మంది ట్రైన్ ని చూడటానికి వచ్చిన వారందరికీ ఒక గంటపాటు నృత్యాలతో అలరించారు. అనంతరం వందే భారత్ ట్రైన్ కి జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. దీనిని పురస్కరించుకొని గుంటూరు డివిజన్ రైల్వే శాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ సంతకంతో ప్రశంసా పత్రాలను విద్యార్థులకు పంపడం జరిగింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ మాస్టర్, సతీష్ లు ప్రశంసా పత్రాలను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు నృత్యాలతో స్వాగతం పలికినందుకు వారిని ప్రోత్సహించడానికి రైల్వే శాఖ నుండి ప్రశంసా పత్రాలని ఇచ్చినట్లు డిఆర్ఎం రామకృష్ణ అన్నారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్,ఇన్ ఫ్రా
ఆర్. శ్రీనివాస్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఆపరేషన్ కె. సైమన్, సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం దినేష్ కుమార్, డీసీఎం
కె. కమలాకర్ బాబు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ టి హెచ్ ప్రసాదరావు, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అధికారులు కైరళి విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని, పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు ప్రోత్సహం కల్పించాలన్నారు. రైల్వే శాఖ నుంచి ప్రశంస పత్రాలు అందుకున్న విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రైల్వే శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి రాజేష్ భాష రాహుల్ విజయలక్ష్మి మంజుల రహీమున్నీసా తదితరులు పాల్గొన్నారు.