రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 24. (జనంసాక్షి). సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా చేతిమగ్గంపై వెండి పట్టు దారాలతో సచిన్ టెండుల్కర్ దంపతుల చిత్రాన్ని నేసి పలువురుని అబ్బుర పరుస్తున్నారు. సుమారు 20 రోజులపాటు శ్రమించి 47 ఇంచుల వెడల్పు 60 ఇంచుల పొడవుతో వెండి ,పట్టుదరాలను ఉపయోగించి సచిన్ టెండుల్కర్ దంపతుల చిత్రాన్ని రూపొందించినట్లు హరిప్రసాద్ తెలిపారు. భారత మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్ కు అందజేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. గోవాలో జరిగే సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనే సందర్భంగా చాముండేశ్వరి నాథ్ చిత్రాన్ని సచిన్ టెండూల్కర్ అందజేయనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెళ్ది హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ- చేతి మగ్గంపై వెండి పట్టు దారాలతో సచిన్ టెండుల్కర్ దంపతుల చిత్రం




