Wednesday, 4 November 2026

పేదోడు ఓడిండు!గొప్పోడు గెలిచిండు!

మంచిర్యాల జిల్లా క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధి లోని మంచిర్యాల – నాగపూర్ రహదారి లో ఆర్కేపీ ఎంఎన్ఆర్ గార్డెన్స్ పక్క నుంచి ఆర్ముర్ హైవే కోసం సర్వే చేస్తున్నారు! గార్డెన్ పక్క నుంచి ఒకసారి,అంతకు ముందు ఏసిసి క్వారీ కి వెళ్లే దారి నుంచి ఒకసారి సర్వే చేసారు! ఒక ప్రైవేట్ స్కూల్ యజమాని మంచిర్యాల బీజేపీ నేతను పట్టుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వద్దకు వెళ్లి ఏ సిసి క్వారీ నుంచి వెళ్లే రోడ్డు అలైన్మెంట్ ను మార్పించాడు! ఇది చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు,బడా బాబులకు లాభం చేకూరింది! మరోసారి ఎంఎన్ఆర్ గార్డ న్ పక్క నుంచి సర్వే జరిగింది! అక్కడ కూడా బడా బాబులు అడ్డం పడ్డారు! ఇలా ఇప్పుడు చివరిగా కొంత ఎంఎన్ ఆర్ గార్దన్ కు నష్టం జరుగ కుండా రోడ్డు ఆవల పేదోళ్ల ప్లాట్లు,ఇండ్లు ఉన్న చోటికి వచ్చి,అలైమెంట్ ఫైనల్ చేసి గెజిట్ కూడా ఓకే అయ్యిందని కనీసం భూమి యజమానులకు సమాచారం ఇవ్వకుండా వచ్చి వాటిలో బాజాప్తా బండలు పాతేశారు!( నిజానికి అంత దూరం పోకుండా ఎంఎన్ ఆర్ పక్కన ఉన్న రోడ్డు మీది నుంచి అలైన్మెంట్ తీసుకోవచ్చు,కాని ఎందుకో పేదోళ్ల మీద కన్ను పడింది) అందుకే అన్నాను! గొప్పోడు గెలిచిండు! పేదోడు ఓడిండు అని! ఎక్కువ మంది రిటైర్డ్ గని కార్మికుల కుటుంబాల వారే ఇక్కడ 15 నుంచి 20 లక్షలు పెట్టి ప్లాట్లు కొన్నారు! ఇండ్లు కట్టుకుంటున్నారు! కొందరు బోర్లు కూడా వేసుకున్నారు! ఇప్పుడు ఇలా అకాస్మాత్తు గా మీ చెమట చుక్కలు ధారపోసి కొనుగోలు చేసిన భూముల్లో రెవిన్యూ,ఎన్ హెచ్ అధికారులు,సర్వేయర్ లు వచ్చి కొలతలు కొల్చి మీ భూముల్లో రోడ్డు వస్తున్నది! ఇదిగో గెట్టు అంటే సామాన్యుడు ఏమి చేయగలడు! మంచిర్యాల ఆర్డీఓ కు వినతి పత్రం ఇచ్చారు! సర్వే ను అడ్డుకున్నారు! స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ అయినా వారికి న్యాయం చేయాలి! ముందు జరిపిన సర్వే లు ఎందుకు రద్దు చేశారు? పెద్దోనికి ఒక న్యాయం చిన్నోనికి ఒక న్యాయమా? పట్టా భూముల్లో ఇల్లు నిర్మించుకోడానికి వేలాది రూపాయలు మున్సిపాలిటీ కి ఫీజులు కూడా చెల్లించి ఉన్నారు!ఇదేం అరాచకం? కనీసం ప్లాటు యజమానికి సమాచారం ఇవ్వకుండా భూమిలో హద్దులు పెట్టుడు ఏమిటీ? సమాధానం చెప్పాలి? అధికారుల ఆటవిక న్యాయం ఇది అంటూ భూమి యజమానులు వాపోతున్నారు! పేదోళ్ల మీద బుల్ డోజర్లు,గొప్పోళ్ళ మీద దయ ఏమిటో? సమాధానం చెప్పాలి! అంటూ దుఃఖం తో భూ యజమానులు కన్నీరు,మున్నీరు అవుతున్నారు! బిఆర్ఎస్ క్యాతన్ పల్లి కమిటీ అధ్యక్షుడు అజీజ్ స్పాట్ కు వచ్చి అందరితో మాట్లాడి ఎమ్మెల్యే కు చెప్పి న్యాయం చేపిస్తాను అన్న తర్వాత వారు శాంతించారు! సర్వే ను తాత్కాలికంగా ఆపారు! న్యాయం జరగాలి! జిల్లా కలెక్టర్ కూడా సమస్యను పరిశీలించాలి! పేదల పక్షపాతి గా పేరున్న కలెక్టర్ న్యాయం చేయాలి! వారి గుండెల బరువును తగ్గించాలి! అది న్యాయం ద్వారానే సాధ్యం అవుతుంది!