– చర్చిల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నాం
– దళిత కైస్త్రవులను అన్ని విధాల ఆదుకుంటాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– విజయవాడ సెయింట్ పాల్స్ బసలికా చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం
విజయవాడ, డిసెంబర్25(జనంసాక్షి) : కైస్త్రవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం విజయవాడలోని సెయింట్ పాల్స్ బసలికా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అనంతరం ప్రసంగించారు. ప్రతి సమస్యకు బైబిల్, ఏసు బోధనల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. మానవ జన్మలో కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయని, నీతి నిజాయతీకి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్లు సేవకు మారుపేరు అని కొనియాడారు. క్రిస్టియన్ మిషనరీ స్థాపించిన స్కూళ్లలో చదివిన వారు నేడు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని గుర్తుచేశారు. చరిత్ర ఉన్నంత వరకు మదర్ థెరిసా గుర్తిండిపోతారని కొనియాడారు. సెయింట్ పాల్స్ బసలికా చర్చికి రూ.1.5కోట్లను గ్రాంటుగా ఇచ్చి చర్చిని అభివృద్ధి చేస్తామని హావిూ ఇచ్చారు. గుంటూరులో కైస్త్రవ భవనం నిర్మిస్తున్నామని, తెల్లకార్డులు ఉన్నవారందరికీ క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానవాటికల నిర్మాణానికి రూ.100 కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. క్రిస్టియన్లుగా ఉన్న దళితులందరికీ ఎస్సీ ¬దా కల్పించే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. జెరూసలెం యాత్రలకు రూ.7కోట్లు ఖర్చు చేస్తున్నామని, కైస్త్రవ యువతుల పెళ్లికి రూ.50వేలు ఆర్థికసాయం అందజేయనున్నట్లు చెప్పారు. క్రిస్టియన్ దళితులందరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రార్థనల్లో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే బోండా ఉమ, విజయవాడ మేయర్ శ్రీధర్, కలెక్టర్ లక్ష్మీ కాంతం, కమిషనర్ జె నివాస్ తదితరులు పాల్గొన్నారు.
కైస్త్రవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం




