Wednesday, 4 November 2026

కొంగర కలాన్ సర్వే నంబర్ 85 ,89 లో పేద రైతుల భూమి కబ్జా

కొంగర కలాన్ సర్వే నంబర్ 85 ,89 లో పేద రైతుల భూమి కబ్జా

అడ్డుకో బోయిన రైతులపై బౌన్సర్ లతో బెదిరింపు లు

మంత్రి సబితా తనయుడు పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన రైతులు

రైతులకు మద్దతు తెలిపిన మహేశ్వరం బీజేపీ ఇంచార్జి శ్రీరాములు

కలెక్టర్ కు పిర్యాదు చేసిన పట్టించుకోని వైనం

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, జనవరి10(జనంసాక్షి):- రంగారెడ్డి జిల్లా అధిబాట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ సర్వే నంబర్ 85-89 లో 58 ఎకరాలు భూమి కబ్జా మా భూమి మాకు కావాలంటూ ఆందోళన చేసిన రైతులు ఇట్టి వివాదాస్పద భూమిని పరిశీలించి న మహేశ్వరం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి అందెల శ్రీరాములు కబ్జాలో ఉన్న రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి తనయుడు కార్తీక్ రెడ్డి అండతో తోనే రైతులను బెదిరింపులు గురించేస్తున్నారని అన్నారు గత కొన్ని సంవత్సరాల నుండి హైకోర్టులో ఈ భూమి పై కేసు కొనసాగుతున్న నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది
జిల్లా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తనయుడు పి. కార్తీక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన రైతులు, బీజేపీ నేతలు కలెక్టరేట్ వెళ్లే రహదారి కూడా ఈ భూమి నుండి ఉందని, నిజంగా వాళ్ళు భూమి అయితే నష్ట పరిహారం కోర్టు లో ఎందుకు జమావత్తునని ఆరోపించారు
సుమారుగా 500కోట్ల భూమిని రైతులనుండి దోచుకున్నారని, పేదల భూములను లాక్కుని, వెంచర్ చేయడం ఏమిటి అని ప్రశ్నించారు పోలీసుల సాక్షిగా బౌన్సర్లు, మహిళా రైతులు పరస్పర దాడి ప్రయత్నం చేశారు,మంత్రి బినామీగా వ్యవహారం చేస్తున్నా నగరానికి చెందిన వ్యక్తులు రైతులు ఇట్టి భూమిపై 2005 2006 ఓ ఆర్ సి తీసుకున్నారు తర్వాత కొంతమంది రైతులు పట్టాలు చేసుకున్నారు అయితే ఇట్టి భూమిపై కోర్టు లో స్టే ఉండగా కొంతమంది రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లను తీసివేశారు ఎమ్మార్వో కార్యాలయంలో పహనీల పై తమకు నచ్చిన వ్యక్తుల పేర్లు నమోదు చేశారు అధికారుల అన్నదండలతో పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నారు బాధిత రైతులు తమ భూమిని చదును చేస్తున్నారని తెలుసుకొని అడ్డుకోవడానికి వెళ్లిన రైతులపై బౌన్సర్లను పెట్టి రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇట్టి భూమిలో వాళ్లకు సంబంధించిన ఆ విధంగా చేసుకోవడంలో రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఆక్రమణలకు ఒక ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ బద్రికి లాలూజు కొడుతున్నారని అన్నారు మంత్రి మౌనం పై అర్థం ఏమిటని అన్నారు ఇట్టి భూ సమస్య ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం గుడ్డురంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు ఇప్పటికైనా మంత్రి సబితా భూధందాలు మానుకొని రైతులకు న్యాయం చేయాలని లేడి పక్షంలో బిజెపి పార్టీ రైతుల పక్షాన మద్దతుగా నిలిచి ఆందోళన చేస్తామని హెచ్చరించారు